హరికృష్ణను కడసారి చూసేందుకు అభిమానులకు అనుమతి!

  • నిన్న వీఐపీల రాకతో అభిమానులకు నిరాశ
  • నేడు అభిమానులకు నివాళులు అర్పించే చాన్స్
  • మధ్యాహ్నం 2.30 నుంచి అంతిమయాత్ర

తమ అభిమాన నేత, నటుడు హరికృష్ణను కడసారి చూసేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులకు కుటుంబ సభ్యులు అవకాశం కల్పించారు. నిన్నంతా వీఐపీలు వస్తూ, పోతూ ఉండటంతో సాధారణ కార్యకర్తలకు, ఫ్యాన్స్ కు హరికృష్ణ బౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించే అవకాశం దక్కలేదు. ఈ ఉదయం 8 గంటల నుంచి మెహిదీపట్నంలోని ఆయన ఇంటివద్ద బారికేడ్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేసి, ఓ క్రమ పద్ధతిలో అభిమానులను హరికృష్ణ ఇంటిలోనికి అనుమతిస్తున్నారు. కాగా, ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానుంది.