స్వామీజీలు రాజకీయాలకు అతీతం కాదు ` స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి

 

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రభావితం చేస్తున్నారా? ఇటీవల జరిగిన, జరుగుతున్న కొన్ని సంఘటనలను విశ్లేషించినప్పుడు శారదా పీఠం స్వామీజీ ప్రభావం రాజకీయ నాయకులపైనా, పార్టీ పైనా ప్రబలంగా కనిపిస్తుంది. గతంలో విశాఖకే పరిమితమైన శారదాపీఠం స్వామీజీ విస్తృత పర్యటనలను, శారదాపీఠం విభాగాలు ఇటీవలి కాంలో ప్రాచుర్య ంలోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా డిసెంబర్‌లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయం సాధించడం వెనుక స్వామీజీ అధ్వర్య ంలో నిర్వహించిన రాజశ్యామల యాగం చరిత్ర గతినే మార్చేసిందన్న అభిప్రాయం కలిగింది. బిజెపి తరపున కాకినాడ శ్రీపీఠం అధిపతి స్వామీ పరిపూర్ణానంద చేసిన ప్రసంగాలకంటే. పర్యటనల కంటే విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్య ంలో నిర్వహించిన రాజశ్యామల హోమ ప్రభావం వల్లే కేసీఆర్‌ అధికార పీఠాన్ని తిరిగి సాధించుకోవడానికి దోహదపడిరదనే అభిప్రాయం ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించి అక్కడ ప్రతిపక్షనాయకునిగా ఉన్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్వహించిన 3648 కి.మీల. పాదయాత్ర వెనుక శారదా పీఠం స్వామీజీ సలహా, సంప్రదింపులు ఉన్నాయని చెబుతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 14 నెలల పాటు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభించడానికి ముందు, పాదయాత్ర ముగించిన తరువాత తిరుమలోని శారదా పీఠంలో స్వామిని సందర్శించుకొని ఆయన ఆశీస్సులు జగన్‌ పొందడం చర్చనీయాంశమైంది.
తెంగాణలో టిఆర్‌ఎస్‌కు, ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్సార్సీపికి స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉన్నాయన్న విషయం తెలుగు దేశం పార్టీ నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది. విశేషమేమిటంటే శారదాపీఠం స్వామీజీని తరచూ సందర్శించే వారిలో తెలుగు దేశం పార్టీకి చెందిన మంత్రు కళా వెంకట్రావు, సిద్ధా రాఘవరావు, గంటా శ్రీనివాసరావు ఉన్నారని చెబుతున్నారు. స్వామీజీలకు రాజకీయాలతో పనేమిటన్న ప్రశ్నకు స్వామీ స్వరూపానంద తనదైన శైలిలో సమాధానమిచ్చారు. స్వామీజీలకు రాజకీయాపట్ల ఆసక్తి ఉండడం తప్పులేదని, దైనందిన కార్యక్రమాలో మేము ఈ ప్రపంచంలో పాత్రధారులుగా ఉన్నప్పుడు ,ఆధ్యాత్మిక నాయకుడుగా రాజకీయాపట్ల అవగాహనకలిగి భాగస్వామ్య ం వహించడంలో తప్పులేదని, తమకు స్వ ంత విశ్వాసాలుస్వామీజీకు ఉంటాయని మంత్రా ల వల్ల, హోమాల వల్ల ఫలితాలుండవన్న కొంతమంది అభిప్రాయం తప్పని, తాము నిర్వహించిన రాజశ్యామల హోమం వల్ల తేటత్లెమైందని స్వామీ స్వరూపానంద స్వామి అన్నారు.
తెంగాణలో టిఆర్‌ఎస్‌నేత కేసీఆర్‌ ఆధ్వర్య ం లో రాజశ్యామల హోమం సత్ఫలితానిచ్చిందని ఆయన స్పష్టం చేశారు. స్వామీజీలకు అందరిపట్ల సమభావం ఉండాలని, కాషాయవస్త్రధారులైన స్వామీజీలు రాజకీయ పార్టీలవైపు మొగ్గుచూపినట్లు కనిపించవచ్చా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ… తాను ఏ పార్టీకీ వ్యతిరేకం కాదనీ, వైఎస్‌ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దేవాలయ అర్చకుల సమస్యపై, హక్కుపై పోరాటం చేశాననీ, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ఆర్‌ అందుకు సంబంధించి పేదలైన అర్చకుకు సాయం అందించారని స్వామీజీ పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం తెలుగు దేశం ప్రభుత్వ ం పేద అర్చకుల హక్కులను పట్టించుకోవడంలేదని ,టిటిడి అర్చకుల కేసులో హైకోర్టు ఉత్తర్వు లను సైతం ఈ ప్రభుత్వ ం పట్టించుకోవడం లేదని ,అనువంశిక అర్చకత్వ ం విషయంలో జోక్య ం చేసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని స్వామీజీ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ ,తెలంగాణా రాష్ట్రాలో పీఠాధిపతులు, స్వామీజీలు ఆధ్యాత్మికాంశాలకు రాజకీయాలకు లంకెవేయడం గురించి సమాధానమిస్తూ… అర్చకుల అంశంలో పోరాటం చేయడం రాజకీయంకాదని, అది ఆధ్యాత్మిక చింతనలో భాగమేనని టిటిడి అనుసరిస్తున్న అనువంశిక అర్చకత్వ వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడం రాజకీయం కాదని స్వామీజీ అన్నారు. పీఠాధిపతులు,స్వామీజీలు ఈ దేశంలో భాగస్తులేనని రోజువారీ పరిపానాంశాల్లో వారి ప్రమేయాన్ని త్రోసిరాజనలేరని ఆయన సమాధానమిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిని తాను వ్యతిరేకించడంలేదని ఆయన పట్ల వ్యతిరేకతగానీ, అభ్య ంతరాలుకానీ తానెక్కడా వ్యక్తం చేయలేదని, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి తనకు అంతగాతెలియదని, వ్యక్తిగత పరిచయంకూడా లేదని కేవలం టివిలోను, హోర్డింగ్‌లపైనే ఆయన ముఖం తెలుసునని స్వామీజీ పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనవద్దకు వచ్చి ఆశీస్సులు కోరినందువల్లే రాజశ్యామల హోమం చేయించానని, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత ఆశీస్సులు కోరినందున పీఠం తరపున ఆశీస్సు అందించాననీ, 2019లో రాష్ట్రానికి మంచి పరిపాలన వైఎస్‌ జగన్‌ అందిస్తాడన్న నమ్మకం తనకుందని స్వామీజీ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మీరు వ్యతిరేకిస్తున్నారా? అన్న ప్రశ్నకు స్వామీజీ స్ప ందిస్తూ… తనకు చంద్రబాబుతో ఎటువంటి పరిచయం లేదని అలాంటప్పుడు ఆయనను వ్యతిరేకించాల్సిన అవసరం తనకు లేదన్నారు. మంచి ఉద్దేశాలతో తన వద్దకు వచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం లేదా కార్యక్రమాలను నిర్వహించమన్నప్పుడు వారి ఆకాంక్షకు అనుగుణంగానే వాటిని నిర్వహిస్తుంటానని అయితే తన విశాఖ శారదాపీఠం సమగ్రతకు ఎటువంటి ఇబ్బ ందులు ఎదురుకావని ఆయన అన్నారు. స్వామీజీలను, పీఠాలను వ్యతిరేకిస్తూ కొంతమంది మాట్లాడుతున్న విషయం తనకు తెలుసునని ఆయన చెప్పారు.
ఇటీవ తిరుమలలో వైసీపీ అధినేత తన పీఠానికి వచ్చి ఆశీస్సులు కోరినందున రాష్ట్రానికి మంచిచేయాలని ఆశీర్వదించానని, ఆయన తండ్రి వైఎస్‌ఆర్‌ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాలను నెరవేర్చాలని సూచించానని స్వామీ స్వరూపానదం సరస్వతి చెప్పారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత టిటిడి ఆధ్వర్య ం లో రామాయణ, మహాభారత గ్రంధాలను ముద్రించారని అది తన సలహా మేరకే జరిగిందని స్వామీజీ స్పష్టం చేశారు. అనువంశిక అర్చక సమస్యను పరిష్కరించాలని జగన్‌కు సూచించానని ఆయన చెప్పారు.
(మిర్రర్‌ టుడే ప్రత్యేక ఏర్పాటు)