స్కూల్ బిజినెస్ వైపు చిరంజీవి చూపు.. శ్రీకాకుళంలో తొలి ఇంటర్నేషనల్ స్కూల్!

Share This

చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరిట ప్రారంభం
అత్యాధునిక సౌకర్యాలు, నిపుణులతో విద్యా బోధన
గౌరవ అధ్యక్షుడిగా హీరో రామ్ చరణ్
కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు విద్యారంగంలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న ఈ మాజీ కేంద్ర మంత్రి ఇప్పుడు పాఠశాల విద్యపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇందుకు ఏపీలోని మారుమూల ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాను ఎంచుకున్నట్లు చిరంజీవి సన్నిహిత వర్గాలు తెలిపాయి చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరిట తాము విద్యా సంస్థను ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ సీఈవో జె.శ్రీనివాసరావు ప్రకటించారు.

అధునాతన సౌకర్యాలు, ఏసీ వసతులతో శ్రీకాకుళం నగర శివార్లలోని పెద్దపాడు రోడ్డులో మొదటి క్యాంపస్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు ఐజిసిఎస్ఈ, సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తామన్నారు. తమ స్కూల్ గౌరవ వ్యవస్థాకుడిగా మెగాస్టార్ చిరంజీవి, గౌరవ అధ్యక్షుడిగా రామ్ చరణ్, గౌరవ చైర్మన్ గా నాగబాబు ఉంటారని తెలిపారు. అలాగే మెగస్టార్ అభిమానుల పిల్లలకు ఫీజులో ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు.