సోనమ్ కపూర్ వ్యాఖ్యలపై మండిపడ్డ కంగనా రనౌత్

నేను చెప్పేవి తప్పని ఆమె ఎలా చెప్పగలుగుతుంది?
సోనమ్ కపూర్ గొప్ప నటేమి కాదు
నా గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు?
‘క్వీన్’ దర్శకుడు వికాస్ బెహెల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల ఆరోపించింది. ఈ ఆరోపణలపై మరో నటి సోనమ్ కపూర్ స్పందిస్తూ, కొన్నిసార్లు కంగన చేసే వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవడం కష్టమని, అయినప్పటికీ ఆమె తనకు జరిగిన ఘటనల గురించి ధైర్యంగా బయటపెట్టడం అభినందించదగ్గ విషయమని..ఈ విషయంలో ఆమెను తాను గౌరవిస్తానని చెప్పింది.

అయితే, సోనమ్ చేసిన వ్యాఖ్యలపై కంగన మండిపడుతోంది. ‘కొన్నిసార్లు కంగన చేసే వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవడం కష్టం’ అన్న సోనమ్ వ్యాఖ్యలకు అర్థమేంటని ప్రశ్నించింది. కొందరు మహిళలను మాత్రమే నమ్మాలన్న లైసెన్స్ ఆమెకు ఉందా? నేను చెప్పేవి తప్పని ఆమె ఎలా చెప్పగలుగుతంది? అంటూ మండిపడింది. తన తండ్రి వల్ల తనకు పేరు రాలేదని, ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని చెప్పింది. సోనమ్ కపూర్ గొప్ప నటేమి కాదని, గొప్పగా మాట్లాడుతుందన్న పేరు కూడా లేదని విమర్శించింది. ఇలాంటి సినీ సెలబ్రిటీలకు తన గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించిన కంగన, వారందరినీ అణచివేస్తానని హెచ్చరించింది.