'సైరా' మ్యాజిక్ డైరెక్టర్ ఖరారు... పరిచయం చేస్తూ ప్రోమో విడుదల!

‘సైరా’ మ్యాజిక్ డైరెక్టర్ ఖరారు… పరిచయం చేస్తూ ప్రోమో విడుదల!

అమిత్ త్రివేదికి దక్కిన చాన్స్
పలు హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం
వైరల్ అవుతున్న ప్రోమో
తొలుత ఏఆర్ రెహమాన్ అన్నారు. ఆపై తమన్ వచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ పేరు కూడా వినిపించింది. చివరకు అవకాశం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదికి దక్కించి. చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైరా’ సంగీత దర్శకుడిగా అమిత్ ను తీసుకున్నట్టు చెబుతూ, చిత్ర యూనిట్, ఓ ప్రోమోను విడుదల చేసింది. హిందీలో ‘ఉడాన్’, ‘వేక్‌ అప్‌ సిద్’, ‘ఐషా’, ‘దేవ్‌ డి’, ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’, ‘ఇషక్‌ జాదే’, ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’, ‘బాంబే వెల్వెట్‌’, ‘ఉడ్తా పంజాబ్‌’, ‘క్వీన్’ వంటి చిత్రాలకు అమిత్ సంగీతాన్ని అందించాడు. చిరంజీవితో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఈ ప్రోమోను విడుదల చేయగా, ఇప్పటికే లక్షన్నర మందికి పైగా వీక్షించారు. ఆ ప్రోమోను మీరూ చూడవచ్చు.