“సైరా”తో మెగాస్టార్ సరికొత్త రికార్డ్!

“సైరా”తో మెగాస్టార్ సరికొత్త రికార్డ్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రాత్మిక చిత్రం “సైరా” నరసింహా రెడ్డి.రామ్ చరణ్ నిర్మాణ సారధ్యం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసిపోయింది.అలాగే చిరు కూడా తన డబ్బింగ్ ను కూడా రికార్డు స్థాయిలో ముగించారట.ఎంతో మంది అగ్రనటులు ఉన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాను చిరు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఈ సినిమా కోసం ఆయన ముగించిన డబ్బింగ్ సమయం చెప్తుందని మెగా అభిమానులు అంటున్నారు.ఈ సినిమాలోని తన పాత్ర కోసం చిరు కేవలం 20 గంటల్లోనే తన డబ్బింగ్ ను పూర్తి చేసి ఆశ్చర్య పరిచారట.ఈ 20 గంటల వ్యవధిలోనే భారీ లెంగ్త్ ఉన్న డైలాగులు కూడా ఉన్నట్టు సమాచారం. ఎలాగో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథనం కావడంతో పెద్ద పెద్ద డైలాగులను మనం ఆశించవచ్చు.అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే అక్టోబర్ లో విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.