12న సెలవు పెడితే నాలుగు రోజుల వరుస సెలవు!

సెంటిమెంట్ : ఏపీ సీఎం ని డిసైడ్ చేసేది..ఆ నియోజికవర్గమేనా..?

Share This

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు సెంటిమెంట్లకు పెద్ద పీటే వేస్తారు.ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ ఒకటే రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించేది మాత్రం ఆ నియోజకవర్గమే అని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు విస్తృతంగా చర్చకు వస్తుంది.అయితే అలంటి సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గాలు రాష్ట్రంలో చాలా ఉన్నా సరే దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని విశ్లేషకులు అంటున్నారు.అదే పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఉంగుటూరు నియోజకవర్గం.

ఇప్పటి వరకు అక్కడ పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు ఏ పార్టీకి చెందిన వారు అయితే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది అన్న బలమైన సెంటిమెంట్ ఒకటి ఉంది.ఇప్పటి వరకు గడిచిన మూడు ఎన్నికలు చూసుకుంటే 2004-09 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వట్టి వసంత్ కుమార్ గెలుపొందారు.అలాగే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గన్ని వీర గంగలు గెలుపొందారు.ఇలా అక్కడ ఎవరు గెలిస్తే వారి పార్టీయే అధికారంలోకి వచ్చింది.దేనితో ఈసారి ఎన్నికలలో ఎవరు గెలుస్తారా అన్నది కీలకంగా మారింది.అక్కడ మూడు పార్టీలు పోటీ చేస్తున్నా సరే ప్రధాన పోరు టీడీపీ మరియు వైసీపీ ల మధ్యనే ఉండనుందని తెలుస్తుంది.మరి ఈ రెండు పార్టీలలో ఎవరు గెలుస్తారో..లేక ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారో చూడాలి.