ఏపీ నూతన అసెంబ్లీ ప్రత్యేకతలు... జాతీయ పార్టీల ప్రాతినిధ్యంలేని తొలి సభ!

సీట్ల కేటాయింపు వివాదంపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్

Share This

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ ఉదయం సీట్ల కేటాయింపు వివాదంపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, సభలో నవ్వులు పూయించారు. సీట్ల సర్దుబాటు విషయమై ఎవరూ జోక్యం చేసుకోలేదని, పూర్తిగా రూల్స్ ప్రకారమే ఎవరు ఎక్కడ కూర్చోవాలన్న విషయాన్ని తేల్చి, వారికి సీట్లు కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు. 

ఇదే సమయంలో వివాదానికి కారణమైన కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని ప్రస్తావిస్తూ, సభ మొదలైనప్పటి నుంచి ప్రతిపక్షం పక్క వరుసలోనే ఆయన కూర్చుంటూ ఉన్నారని, గతంలోనూ ఆయన అక్కడే కూర్చోవడం వల్ల ఆ సీటుపై కొంత వ్యామోహం ఉండవచ్చని, అది తప్పు కాదని అన్నారు. ఎవరికి కేటాయించిన సీట్లోలో వాళ్లు కూర్చోవాలని స్పీకర్ చెప్పింది శ్రీధర్‌ ను ఉద్దేశించేనని, ఆ వెంటనే గుడ్‌ బాయ్‌ లా మారు మాట్లాడకుండా తన సీట్లో తాను శ్రీధర్ కూర్చున్నాడని ప్రశంసించారు. అంతలోనే చంద్రబాబు రియాక్ట్ అవుతూ, నిన్నటివరకూ తన పక్కన కూర్చోబెట్టుకున్న అచ్చెన్నాయుడిని, వెనక్కు పంపి, గోరంట్లను పక్కన బెట్టుకుని, కావాలని సీట్లు మార్చి గోల చేస్తున్నారని విమర్శించారు.

Leave a Reply