సీఎం నేమ్ ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారో తెలియదా?... మీ ఫ్రస్ట్రేషన్ తో అసహ్యం పుట్టిస్తున్నారు: విజయసాయి రెడ్డి

సీఎం నేమ్ ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారో తెలియదా?… మీ ఫ్రస్ట్రేషన్ తో అసహ్యం పుట్టిస్తున్నారు: విజయసాయి రెడ్డి

Share This

గత మూడు నాలుగు రోజులుగా వైఎస్ జగన్ సీఎం నేమ్ ప్లేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ, దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “ముఖ్యమంత్రి ఆఫీస్ నేమ్ ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారో తెలియదా ఉమా? ఎవరూ సొంతంగా తయారు చేయించుకుని ఆఫీసు ముందు తగిలించుకోరు. మీరే ఒక గ్రాఫిక్ నేమ్ ప్లేట్ సృష్టించి దానిపై పిచ్చికూతలు కూస్తున్నారని అందరికీ తెలిసిపోయింది. ఫ్రస్టేషన్ లో మీ మాటలే కాదు చేతలూ అసహ్యం కలిగిస్తున్నాయి” అని అన్నారు. అంతకుముందు “జీవితాంతం వ్యవస్థల్ని మేనేజ్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఫిర్యాదులుంటే చెప్పొచ్చు. ఇవసలు ఎన్నికలే కావనడం, పోలింగు ముగిసాక ఓటింగ్ మెషిన్లను ట్యాంపర్ చేస్తారనడం మానసిక నియంత్రణ కోల్పోయిన వ్యక్తి చేసే ఆరోపణలు” అని నిప్పులు చెరిగారు.