'సవ్యసాచి' విషయంలో ముందుగా భయపడ్డాను: చైతూ

‘సవ్యసాచి’ విషయంలో ముందుగా భయపడ్డాను: చైతూ

నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘సవ్యసాచి’ రేపు థియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా చైతూ మాట్లాడుతూ .. ‘ప్రేమమ్’ సినిమా షూటింగు సమయంలోనే చందూ మొండేటి నాకు ‘సవ్యసాచి’ స్టోరీ లైన్ చెప్పాడు. కథకి ఏ పాయింట్ ప్రాణంగా భావిస్తున్నామో అది ఎంతవరకు ఆడియన్స్ రిసీవ్ చేసుకోగలుగుతారా అనే విషయంలో నేను చాలా టెన్షన్ పడ్డాను.

నా పరిస్థితిని అర్థం చేసుకున్న చందూ మొండేటి, పూర్తి కథను సిద్ధం చేసుకుని వచ్చి వినిపించాడు. ఆడియన్స్ కి ఈ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమవుతుందని అనిపించి అంగీకరించాను. కానీ అవుట్ ఫుట్ అనుకున్న విధంగా వస్తుందో లేదో అనే విషయంలో టెన్షన్ పడ్డాను. ఒకటి .. రెండు షెడ్యూల్స్ పూర్తయిన తరువాత నాకు ఈ సినిమాపై నమ్మకం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ నమ్మకం పెరుగుతూ వచ్చింది. ఈ సినిమా నా కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని తప్పక చెప్పగలను” అనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు.