సరదాగా సెర్బియా వెళ్లిరారాదూ..: విజయసాయిరెడ్డికి బుద్ధా కౌంటర్

తిరుమలలో అన్యమత ప్రచారం విషయంలో చంద్రబాబు బట్టలు చించుకుంటున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈరోజు విమర్శించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని ఆయన సూచించారు. తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. తుగ్లక్ ముఖ్యమంత్రి పాలన చూసి విజయసాయిరెడ్డికి మైండ్ కూడా పోయిందని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.

ఆయన మెంటల్ స్థితి ఇప్పుడు నాలుగో స్టేజీకి చేరుకుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డికి ట్రీట్ మెంట్ ఇచ్చే ఆసుపత్రులు దేశంలో అయితే లేవని స్పష్టం చేశారు. కావాలనుకుంటే ఓసారి సెర్బియా వెళ్లిరావాలనీ, అంతా అక్కడి పోలీసులు చూసుకుంటారని సెటైర్ వేశారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.