సమాచార హక్కు చట్టం అమలుకు చర్యలు: నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్త కిశోర్

రాజమహేంద్రవరం సెప్టెంబర్ 20 :
నగరపాలక సంస్థకు సంబంధించిన అన్ని విభాగాల్లో సమాచారహక్కు చట్టం సక్రమంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్త కిషోర్ తెలిపారు. శుక్రవారం గార్డ్స్ ఫర్ ఆర్ టి ఐ జాతీయ కన్వీనర్ వరదా నాగేశ్వరరావు అధ్యర్యంలో కమిటీ సభ్యులు కమిషనర్ ను తన చాంబర్లో కలిసి రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో సహా చట్టం సక్రమంగా అమలు కావడంలేదని అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రతి విభాగంలో పి ఐ ఓ లు సక్రమంగా పనిచేయడంలేదని, అదే విదంగా సెక్షన్ 4(1) బి అమలుచేయడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. సహా చట్ట అమలుకు చట్ట అమలు చర్యలు తీసుకోవడంతో పాటు నిర్లక్షం చేసే ఉద్యోగుల పైశాఖాపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో గార్డ్స్ ఫర్ ఆర్ టి ఐ జాతీయ మహిళా కన్వీనర్ ఆకుల విజయభారతి, రాష్ట్ర కమిటీ సభ్యులు వెన్నా సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు
ముత్యాల పోసికుమార్, వాడ్రేవు లక్ష్మీ నరసింహస్వామి, మరిసా సూర్య ప్రకాష్ అంథోని మంజులా కుమారి, అంగడ సరాళా దేవి తదితరులు పాల్గొన్నారు.