సమయం లేకపోవడం వల్ల నే పోటీ చేయడం లేదు : పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌

 

  •  టికెట్‌ నిరాకరించడంతో వివేక్‌ మనస్తాపం
  • కేసీఆర్‌  నమ్మించి మోసం చేశారని ఆరోపణ
  • బీజేపీలో చేరుతారని ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌

ప్రజల్లో అభిమానం ఉన్నప్పటికీ ఎన్నికలకు అతి కొద్ది సమయమే ఉన్నందున ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌ స్పష్టం చేశారు.  వివేక్‌కు కేసీఆర్‌ మళ్లీ టికెట్టు ఇవ్వని విషయం తెలిసిందే.  నమ్మించి గొంతు కోశారని కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వివేక్ అధికార బీజేపీలో చేరుతారని, లేదా స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తారన్న ఊహాగానాలు వచ్చాయి.  వీటన్నింటికీ తెరదించుతూ  వివేక్ ఓ ప్రకటన విడుదల చేశారు.  ఎన్నికల బరిలో తాను ఉండడం లేదని  పేర్కొన్నారు. తక్కువ సమయం ఉన్నదున    పోటీ చేయక పోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చానని తెలిపారు.  తాను పోటీలో ఉండవదన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌ పెద్దపల్లి టికెట్‌ను ఆలస్యంగా ప్రకటించారని  ఆరోపించారు.