శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఆర్జితసేవలు రద్దు

Share This
ఆంగ్ల నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి అన్నిరకాల ఆర్జితసేవలను, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టిటిడి అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబర్‌ 31, జనవరి 1 తేదీల్లో అన్ని ఆర్జిత సేవలతోపాటు, దాతలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు కల్పించే ప్రత్యేక దర్శనం కోటా రద్దు చేసినట్లు తెలిపారు.

టైం స్లాట్‌, దివ్య దర్శనం, అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ ఉండదన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5 నుంచి 7 వరకు ఆర్జిత సేవలతోపాటు ప్రివిలేజ్డ్‌, ప్రత్యేక ప్రవేశం, టైంస్లాట్‌, దివ్యదర్శనం, అంగప్రదక్షిణ టోకెన్ల జారీ ఉండదని స్పష్టం చేశారు. జనవరి 6న తెల్లవారుజామున 2 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.