srilanka bomb latest news

శ్రీలంక పేలుళ్ల ఘటన… 150కి చేరిన మృతుల సంఖ్య

Share This
  • గంటగంటకు పెరుగుతున్న మృతులు
  • 300 మందికి పైగా గాయాలు
  • మొత్తం ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు

లిబరేషన్ టైగర్ల శకం ముగిసిన తర్వాత ప్రశాంతత నెలకొన్న శ్రీలంకలో రక్తం చిందింది. ఈస్టర్ పండుగ సందర్భంగా భక్తితో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని రాజధాని కొలంబోలో దాడులు జరిగాయి. మూడు చర్చిలు, మరో మూడు స్టార్ హోటళ్లలో జరిగిన ఈ దాడుల్లో మరణించినవారి సంఖ్య మధ్యాహ్నానికి 129కి చేరింది. దాదాపు 300 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.

దుండగులు ఉదయం వేళ ఈ దాడులకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడుల పట్ల భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ వెంటనే స్పందించి, కొలంబోలో ఉన్న భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు ట్వీట్ చేశారు.