శ్రీదేవిని తలపిస్తున్న రూప్సా సహా చౌదరి ..

శ్రీదేవిని తలపిస్తున్న రూప్సా సహా చౌదరి ..

యూట్యూబ్’లో కొత్త అందాలు వెతికే కుర్రకారుకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాస్త బొద్దుగా ఉన్నా.. ఆమె రూపం శ్రీదేవిని తలపిస్తోంది. అందుకే చాలామంది బొద్దైన శ్రీదేవి అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇటీవల ఈమె పేరు సోషల్ మీడియాలో తరచు వినిపిస్తోందిపైగా, 2018లో అత్యధిక నెటిజన్లు ఈమె గురించి తెగ వెతికేశారట. ఇందుకు ప్రత్యేక కారణం.. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ‘యూట్యూబ్’ వీడియోనే. ‘రెడ్ హార్ట్ ఎంటర్‌టైన్మెంట్’ అనే ఓ యూట్యూబ్ ఛానెల్. చీర కట్టులోని సెక్సీదనాన్ని చూపిస్తూ.. బొద్దైన మోడళ్ల వీడియోలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా రూప్సా సహా చౌదరీ వీడియోను కూడా విడుదల చేశారు. అప్పటి నుంచి ఆ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఆ వీడియోను 10 మిలియన్ మంది వీక్షించారు. ఎర్ర చీరలో తన బరువైన అందాలను ఆరబోస్తూ సిగ్గు ఒలకబోసే ఈ వీడియో ఎంతోమందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రకారు.. ఆమె అందాలకు ఫిదా అయిపోతున్నారు. అప్పటి నుంచి ఇంటర్నెట్ రూప్సా పేరుతో తెగ వెతికేస్తున్నారు. ఆమె కేవలం మోడల్ మాత్రమేనా? సినిమా హీరోయిన్ కూడానా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

రూప్సా మోడల్ మాత్రమే: పశ్చిమ బెంగాల్‌కు చెందిన 24 ఏళ్ల రూప్సా సహా చౌదరీ శారీ మోడల్. వివిధ వస్త్ర దుకాణాలు, ప్రకటనలకు ఆమె మోడల్‌గా ఉన్నారు. శారీ మోడల్‌గా అందాల విందు మొదలుపెట్టిన రోజు నుంచి ఆమెకు అభిమానులు పెరుగుతూ వచ్చారు. అయితే, ఆమె ఇప్పటివరకు ఎలాంటి చిత్రంలోనూ పనిచేయకపోవడం గమనార్హం. బెంగాలీ యువత ఆమెను ‘బాంగ్ క్రష్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. రూప్సా 2018లో ‘నా’ అనే షర్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ సాంగ్స్, శారీ మోడల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. మరి కుర్రకారు మది దోచుకుంటున్న ‘బాంగ్ క్రష్’ వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి.