శాసనమండలిలో 'వెల్లంపల్లి వర్సెస్ లోకేశ్'!

శాసనమండలిలో ‘వెల్లంపల్లి వర్సెస్ లోకేశ్’!

  • ఏపీ శాసనమండలి సమావేశాలు
  • లోకేశ్ ను పప్పు అన్న మంత్రి వెల్లంపల్లి
  • తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన లోకేశ్
  • మంత్రి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తామన్న చైర్మన్

ఏపీ శాసనమండలి సమావేశాల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ సభ్యుడు నారా లోకేశ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అన్యమత ప్రచారంపై సోషల్ మీడియా దాడి వెనుక నారా లోకేశ్ హస్తం ఉందని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. ఈ సందర్భంగా లోకేశ్ ను విమర్శిస్తూ గూగుల్ లో పప్పు అని కొడితే లోకేశ్ పేరే వస్తోందని అన్నారు. దీనికి లోకేశ్, టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గూగుల్ లో 420, 6093 అని కూడా కొట్టి చూసుకోవాలని టీడీపీ సభ్యులు మంత్రిని ఎద్దేవా చేశారు. లోకేశ్, ఇతర టీడీపీ సభ్యులు గట్టిగా పట్టుబట్టడంతో మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు సభ చైర్మన్ తెలియజేశారు.