వైసీపీ నుంచి బీజేపీలోకి జంప్ వార్తలపై... తోట వాణి స్పందన!

వైసీపీ నుంచి బీజేపీలోకి జంప్ వార్తలపై… తోట వాణి స్పందన!

సామాజిక మాధ్యమాల్లో వార్తలు అవాస్తవం
నిజాలు తెలుసుకుని మీడియా వార్తలు రాయాలి
వైసీపీని వీడేది లేదని స్పష్టం చేసిన తోట వాణి
తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత తోట వాణి, బీజేపీలో చేరుతున్నట్టుగా నిన్న వార్తలు రాగా, ఆమె స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. తనకు సీఎం జగన్ పై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తే, వాటిని నిర్వహిస్తానని, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. మీడియా సైతం తన విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత వార్తలు ప్రచురించిందని అన్నారు. కాగా, గడచిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆమె పెద్దాపురం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆమెపై నిమ్మకాయల చినరాజప్ప విజయం సాధించారు. ఓటమి అనంతరం ఆమె బీజేపీ వైపు చూస్తున్నారని, పెద్దాపురం ప్రాంతంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత కావడంతో బీజేపీ ఆమెను ఆహ్వానిస్తోందని, ఎంపీ సుజనా చౌదరి ద్వారా తోట వాణి బీజేపీలో చేరనున్నారని నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Tags: Totha VaniPeddapuramYSRCP