వైసీపీ చీఫ్ జగన్ లండన్ పర్యటన రద్దు

వైసీపీ చీఫ్ జగన్ లండన్ పర్యటన రద్దు

Share This

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లండన్ పర్యటన రద్దు అయింది. లండన్‌లో చదువుకుంటున్న కుమార్తెను చూసేందుకు జగన్ నేడు కుటుంబ సమేతంగా లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే, శుక్రవారం రాత్రి ఆయన తన పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. నిజానికి జగన్ నేడు లండన్ బయలుదేరి తిరిగి 14న హైదరాబాద్ చేరుకోనున్నట్టు వార్తలు వచ్చాయి.

ఎన్నికలు ముగియడం, ఫలితాల విడుదలకు ఇంకా సమయం ఉండడంతో జగన్ విహార యాత్రకు వెళ్లనున్నట్టు రెండు రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, ఫణి తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అయిన నేపథ్యంలో జగన్ తన లండన్ పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.