వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చున్నారు: లోకేష్ ఎద్దేవా

రాష్ట్రం పట్ల వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు
విపక్షాల ఆరోపణలపై మీడియా ఎదుట చర్చకు మేము సిద్ధం
అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర ప్రయోజనాల పట్ల వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి, అంతా ఇంట్లో కూర్చున్నారని విమర్శించారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మీడియా ఎదుట చర్చకు తాము సిద్ధమని… మీరు సిద్ధమా? అని సవాల్ విసిరారు.

రానున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాసం పెడతామని చెప్పారు. ప్రత్యేకహోదా ఇవ్వని ప్రధాని మోదీని జగన్ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చుదిద్దుతామని తెలిపారు. అంతర్జాతీయ క్రియేటివిటీ సెంటర్ గా అమరావతి ఎదగాలని ఆకాంక్షించారు.