వైసీపీ అధినేత జగన్ పై చాకుతో దాడి.. విశాఖ విమానాశ్రయంలో కలకలం!

వైసీపీ అధినేత జగన్ పై చాకుతో దాడి.. విశాఖ విమానాశ్రయంలో కలకలం!

వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగింది. విశాఖ ఎయిర్ పోర్టులోని వెయిటర్స్ లాంజ్ లో కోడిపందేలకు ఉపయోగించే కత్తితో జగన్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు. భుజంపై కత్తితో గాయపరిచాడు. వైసీపీకి 160 సీట్లు వస్తాయా సార్? అంటూ జగన్ ను పలుకరించిన దుండగుడు… సెల్ఫీ దిగుతానంటూ దాడికి దిగాడు. జరిగిన ఘటనతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు జగన్ అక్కడే ప్రథమ చికిత్స చేయించుకుని, అనంతరం, విమానంలో హైదరాబాదుకు బయల్దేరారు. దాడి ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సివుంది.

జగన్ భుజానికి మూడు కుట్లు వేసిన వైద్యులు!

  • సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స
  • గాయమైన చోట కుట్లు వేయాలన్న వైద్యులు
  • కత్తిపై విషపదార్థాలు ఉన్నాయా? లేదా? అన్నది తేలేది పరీక్షల తర్వాత

విశాఖ ఎయిర్ పోర్ట్ లో కత్తిపోటుకు గురైన వైసీపీ అధినేత జగన్ భుజానికి చికిత్స జరుగుతోంది. హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేస్తున్నారు. కాగా, జగన్ భుజానికి తగిలిన గాయానికి మూడు కుట్లు వేసినట్టు తెలుస్తోంది. జగన్ కు గాయమైన ప్రదేశంలో రక్తనమూనాలను పరిశీలించాల్సి ఉందని, కత్తిపై విషపదార్థాలు ఉన్నాయా? లేదా? అన్న విషయం పరీక్షల తర్వాత తేలే అవకాశం ఉందని సమాచారం.