రాఖీ పండుగ ఎఫెక్ట్.. పెరిగిన బంగారం ధర

న్యూఢిల్లీ: రాఖీ పండుగను పురస్కరించుకుని దేశీయ నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. శనివారం నాటి ట్రేడింగ్‌లో రూ.250 పెరిగి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.30,900కు చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలోకు రూ.400 పెరిగి రూ.38,250కి చేరుకుంది. అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర 1.75 శాతం పెరిగి ఔన్సు ధర 1,205.30 డాలర్లుకు చేరుకోగా, వెండి 2.14 శాతం పెరిగి ఔన్సు ధర 14.77 డాలర్లుకు