వైఎస్ జగన్ లక్ష కోట్ల అవినీతి రాజకీయ ఆరోపణే: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

వైఎస్ జగన్ లక్ష కోట్ల అవినీతి రాజకీయ ఆరోపణే: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Share This

రూ. 1,500 కోట్లకు మాత్రమే ఆధారాలు
ఆ మొత్తాన్నే చార్జ్ షీట్ లో పొందుపరిచాం
లక్ష కోట్లనేది రాజకీయ ఆరోపణలేనన్న లక్ష్మీనారాయణ
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రూ. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారనడం రాజకీయ ఆరోపణేనని జగన్ అక్రమాస్తుల కేసులను దర్యాఫ్తు చేసిన సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, రాజకీయ ప్రచారం కోసం జగన్ పై ఆరోపణలు చేసినట్టుగా ఉందని, తమకు లభించిన ఆధారాల మేరకు అవినీతి ఆరోపణలు రూ. 1,500 కోట్ల వరకూ ఉన్నాయని, తాము దాన్నే చార్జ్ షీట్ లో పొందుపరిచామని అన్నారు. ఎవరో జగన్ పై ఆరోపణలు చేస్తూ, రాజకీయంగా వాడుకుని ఉంటే తానేమీ చేయలేదని అన్నారు. కాగా, ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో లక్ష్మీ నారాయణ, జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.