వెలిగొండ ప్రాజెక్టు తీసుకురాగలిగితే నా జీవితం ధన్యమైనట్టే: పవన్ కల్యాణ్

వెలిగొండ ప్రాజెక్టు తీసుకురాగలిగితే నా జీవితం ధన్యమైనట్టే: పవన్ కల్యాణ్

ఆడపడుచులకు, అక్కాచెల్లెళ్లకు తాను అండగా ఉంటానని, వారిపై ఎవరైనా చేయేస్తే ఆ చేతిని తీసేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో పవన్ మాట్లాడుతూ, రాజకీయం మార్చడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.

2019 అందరికీ చాలా కీలకమైన సమయమని, ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్నది తన కోరికని, అందుకే వారి కోసమే తాను తిట్లు పడుతున్నానని అన్నారు. ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టును తీసుకు రాగలిగితే తన జీవితం ధన్యమవుతుందని చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఓనమాలు నేర్చుకున్నా వాడిని. నేల తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా, మన అభివృద్ధికి ఎవరూ అడ్డమొస్తారో చూద్దాం. మార్కాపురం నుంచి జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పవన్ కల్యాణ్ కోరారు.