ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం..

వీడియో చూపించి మరి అసెంబ్లీలో బాబు పరువు తీసిన జగన్

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే మంచి వాడివేడిగా సాగుతున్నాయి. మొదటి రోజు సభ స్టార్ట్ అయిన వెంటనే కాళేశ్వరం గురించి, అలాగే ఆంధ్ర,తెలంగాణ కలిసి గోదావరి నుండి శ్రీశైలం,నాగార్జున సాగర్ లోకి నీటిని తీసుకోని వచ్చే ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఆ సందర్బాల్లో జగన్ మాట్లాడుతూ ఆవేశంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో ప్రాజెక్టులు కట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి గాడిదలు కాస్తున్నాడంటూ ఘాటుగా విమర్శించాడు. దీనిపై బాబు కూడా గట్టిగానే మాట్లాడాడు.

ఆ తర్వాత జీరో అవర్ పూర్తియైన తర్వాత జగన్ మోహన్ రెడ్డి రైతుల గురించి సుదీర్గంగా ప్రసంగం చేశాడు.గతంలో చంద్రబాబు నాయుడు రైతులకి ఎలాంటి హామీలు ఇచ్చాడు,గతంలో రుణమాఫీ గురించి ఏమి చెప్పాడో ఆ తర్వాత ఎలా మాట మార్చాడో మీరే చూడండి అంటూ ఏకంగా అసెంబ్లీలో చంద్రబాబు గతంలో మాట్లాడిన వీడియోలను చూపించాడు. అందులో చంద్రబాబు రెండు సందర్భాల్లో రెండు రకాలుగా మాట్లాడిన వీడియో చూపించాడు. అది చూసిన చంద్రబాబు మొఖాన నెత్తురు చుక్క లేదనే చెప్పాలి. అది చూసిన జగన్ తో సహా వైసీపీ సభ్యులు ఒకటే నవ్వులు.

ఇలా జగన్ ఈ రోజు అసెంబ్లీ లో పక్క ప్లాన్ తో వచ్చి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చుక్కలు చుపించాడనే చెప్పాలి. గతంలో చెప్పినట్లు ప్రతిపక్ష సభ్యులకి మాట్లాడే సమయం ఇచ్చి, ఆ తర్వాత దానికి తగ్గ కౌంటర్లు ఇస్తూ వైసీపీ అసెంబ్లీలో చెలరేగిపోతుంది.

Leave a Reply