Kathi Mahesh Controversial Comments on Kaushal

విసుగెత్తిస్తున్న కౌశల్ ని గెంటేయండి… కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

  • చివరి దశకు వచ్చేసిన బిగ్ బాస్ సీజన్-2
  • హౌస్ లో ఉన్న ఐదుగురు పార్టిసిపెంట్స్
  • కౌశల్ ను విమర్శిస్తూ కత్తి మహేష్ ట్వీట్లు

టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్-2 చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం హౌస్ లో కౌశల్, తనీష్, దీప్తి నల్లమోతు, గీతా మాధురి, సామ్రాట్ లు ఉన్నారు. వీరిలో కౌశల్ టైటిల్ గెలుస్తాడని అత్యధికులు భావిస్తున్న వేళ, బిగ్‌ బాస్ సీజన్ 1 పార్టిసిపెంట్, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌస్‌ లో ఇటీవల జరిగిన వివాదాలను ప్రస్తావిస్తూ, “కౌశల్ అంతా కోల్పోయాడు. అతన్ని హౌస్ నుంచి బయటకు గెంటేయండి” అని ట్వీట్ పెట్టాడు.

నాని కౌశల్‌ ని ప్రశ్నించిన వేళ, చాలా పేలవమైన, విసుగుపుట్టించే సమాధానం చెప్పాడని, బిగ్‌బాస్ చరిత్రలోనే చాలా చిరాకు తెప్పించిన వ్యక్తి కౌశలేనని మరో ట్వీట్ పెట్టాడు. ఒకవేళ కౌశల్ బిగ్‌ బాస్ 2 టైటిల్ గెలిస్తే మనమెంత ఇడియట్స్ అనేది ప్రూవ్ అవుతుందని కూడా వ్యాఖ్యానించాడు. తాను దీప్తి నల్లమోతు విజయానికి ప్రచారం నిర్వహిస్తానని అన్నాడు.
Tags: Kathi Mahesh, Controversial, Comments,Kaushal,bigg boss2