విషమంగానే సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి పరిస్థితి

విషమంగానే సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి పరిస్థితి

  • వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్యులు
  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు గతంలో శస్త్రచికిత్స
  • లింగాయత్‌ వీరశైవులు ఆరాధ్య దైవంగా భావించే స్వామి

లింగాయత్‌ వీరశైవులు తమ ఆరాధ్య దైవంగా భావించే కర్ణాటక రాష్ట్రం తుముకూరులోని సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి పరిస్థితి విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు బెంగళూరులోని ఆసుపత్రి వైద్యుడు పరమేశ్వర్‌ తెలిపారు. ప్రస్తుతం స్వామీజీ వయసు 111 ఏళ్లు.

ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో గత ఏడాది డిసెంబరు 8వ తేదీన స్వామీజీకి ఆపరేషన్‌ నిర్వహించారు. ఆ తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడిందని భావించినా హఠాత్తుగా స్వామి ఆరోగ్యం క్షీణించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. స్వామి పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడ్యూరప్ప సోమవారం తన కార్యక్రమాలను రద్దు చేసుకుని తుముకూరులోని మఠానికి బయలుదేరారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర మఠానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు కూడా మఠం వద్ద భద్రత పెంచారు.