encounter

విశాఖ ఎన్‌కౌంటర్: ఐదుగురు మావోయిస్టులు హతం

విశాఖ మన్యంలో గత రెండురోజులుగా మావోయిస్టులతో జరిగిన  కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. మావోయిస్టు మిలటరీ ప్లటూన్ విశాఖ జిల్లాలోకి ప్రవేశించిందన్న పక్కా సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. దాడులు, ప్రతీకార చర్యల్లో ప్లటూన్ కీలక పాత్ర అని చెబుతున్నారు. గతేడాది అరకు ఎమ్మల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసింది ప్లటూన్స్ సభ్యులేనని పోలీసులు చెబుతున్నారు.

విశాఖ ఏజెన్సీలో తుపాకుల మోత కొనసాగుతోంది. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. మరుసటి రోజు మరో ఇద్దరిని పోలీసు బలగాలు మట్టుబెట్టాయి. మిగిలిన వారి కోసం కూంబింగ్ ముమ్మరం చేశారు.