Head Master forge signature of Telangana Minister KTR

విద్యాశాఖలో మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ!

  • ఫోర్జరీ చేసిన రావులపెంట జడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్
  • ఓపెన్ స్కూల్ లో కోఆర్డినేటర్ పోస్ట్ కోసం ఫోర్జరీ
  • విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు

ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా రావులపెంట జిల్లాపరిషత్ హైస్కూల్ లో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్న మానవత్ మంగళ… జిల్లా ఓపెన్ స్కూల్ లో కోఆర్డినేటర్ పోస్ట్ కోసం కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు.

నకిలీ లెటర్ హెడ్ పై కేటీఆర్ సంతకం ఉన్నట్టు సృష్టించిన లేఖతో కోఆర్డినేటర్ పోస్టులో గత కొంత కాలంగా మంగళ కొనసాగుతున్నారు. ఈ విషయం వెలుగు చూడటంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Tags: KTR, TRS, Signature, Forgery