విజయ్ దేవరకొండ సినిమాలో మల్లూ బ్యూటీ

తమిళ, మలయాళ ‘భరత్..’ విడుదల వాయిదా
నైజాంలో ‘మహానటి’ సంచలన షేర్
విలన్ పాత్రల వైపు సీనియర్ నటుడు
* మల్లూ బేబీ అనూ ఇమ్మానుయేల్ త్వరలో విజయ్ దేవరకొండ సరసన నటించనుంది. పరశురాం దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఓ కథానాయికగా నటించడానికి అనూ ఇమ్మానుయేల్ ఓకే చెప్పినట్టు సమాచారం. ఇందులో ఆమెది కీలక పాత్ర అని తెలుస్తోంది.
* మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘భరత్ అనే నేను’ తమిళ, మలయాళ వెర్షన్ల విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ భాషల్లో ఈ రోజు విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఈ నెల 31కి వాయిదా వేశారు.
* కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఈ చిత్రం నైజాం ఏరియాలో పదహారు రోజులకు గాను సుమారు 10 కోట్ల షేర్ ను వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
* సీనియర్ నటుడు అర్జున్ విలన్ పాత్రల వైపు మళ్ళుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ‘ఇరుంబు తిరై’ తమిళ చిత్రంలో విలన్ గా నటించిన అర్జున్ తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా నటించే ఓ చిత్రంలో కూడా విలన్ గా నటించడానికి అంగీకరించాడట.