విజయసాయి, మిధున్ రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్!

విజయసాయి, మిధున్ రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్!

పార్టీ పార్లమెంటరీ నేతగా విజయసాయి
లోక్ సభలో వైకాపా పక్ష నేతగా మిథున్ రెడ్డి
లోక్ సభలో విప్ గా మార్గాని భరత్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా విజయసాయి రెడ్డిని నియమిస్తూ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉత్తర్వులు వెలువరించారు. ఇదే సమయంలో లోక్ సభలో వైకాపా పక్షనేతగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, లోక్ సభలో వైకాపా విప్ గా మార్గాని భరత్ లను నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ ముగ్గురినీ ఆయా పదవుల్లో నియమిస్తున్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రికి జగన్ ప్రత్యేక లేఖను పంపారు. తమ పార్టీ తరఫున వీరిని గుర్తించాలని ఆయన కోరారు. కాగా, ప్రస్తుతం విజయసాయి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగా, మిథున్ రెడ్డి, భరత్ లు తాజా లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.