విజయవాడలో క్రాస్ మసాజ్… పట్టుబడిన 11 మంది యువతులు!

మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం
పురుషులకు మహిళలతో మసాజ్
ఆకస్మిక దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
విజయవాడలో మసాజ్ సెంటర్ల ముసుగులో అశ్లీల కార్యకలాపాలు సాగుతున్నాయని, పురుషులకు మహిళలతో మసాజ్ లు చేయిస్తూ, వారితో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి, నగర పరిధిలోని మొగల్రాజపురం, లబ్బీపేట, గురునానక్ కాలనీల్లో ఉన్న మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేశారు. పోలీసులు దాడులకు వెళ్లిన సమయంలో డైమండ్ బ్యూటీ పార్లర్, లా రాయల్స్ బ్యూటీ పార్లర్ లలో క్రాస్ మసాజ్, వ్యభిచారం జరుగుతున్నట్టు నిర్దారణ అయింది. ఇద్దరు మహిళా నిర్వాహకులు, 11 మంది మసాజ్ చేసేందుకు వచ్చిన అమ్మాయిలు సహా, ముగ్గురు యువకులను అరెస్ట్ చేశామని, రెండు పార్లర్ లపై కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు వెల్లడించారు.