వాలెంటైన్స్ డే కానుకగా ప్రియా ప్రకాశ్ వారియర్ ‘ఒరు ఆదార్ లవ్’

వాలెంటైన్స్ డే కానుకగా ప్రియా ప్రకాశ్ వారియర్ ‘ఒరు ఆదార్ లవ్’

స్కూల్ ఏజ్ లోనే ప్రేమ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’. ఈ చిత్రం విడుదల కాకముందే హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ క్రెడిట్ కొట్టేసింది. ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల గత ఏడాదిగా ఆలస్యమవుతూనే ఉంది. విడుదల కాకముందే ప్రియా ప్రకాష్ వారియర్ కు ‘స్టార్’ రేంజ్ పాప్యులారిటీని సంపాదించిపెట్టిన ‘ఒరు ఆదార్ లవ్’ ఈ నెల 14న వాలెంటైన్స్ డే రోజున విడుదల కానుంది.

ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ లో హీరో రోషన్, హీరోయిన్ ప్రియల మధ్య కిస్ సీన్ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఓ బాలీవుడ్ చిత్రంలో ప్రియ నటిస్తోంది.