లోక్‌సభలో రైతుబంధు పథకాన్ని ప్రస్తావించిన ఒడిశా ఎంపీ

లోక్‌సభలో రైతుబంధు పథకాన్ని ప్రస్తావించిన ఒడిశా ఎంపీ

తెలంగాణ రైతుబంధు పథకాన్ని బీజేడీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ లోక్‌సభలో ప్రస్తావించారు. తెలంగాణ రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం అని ప్రశంసించారు. తెలంగాణ స్ఫూర్తితోనే పలు రాష్ర్టాలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాయని చెప్పారు. ఒడిశాలో కాలియా పేరుతో తమ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్లే కేంద్ర ప్రభుత్వం కూడా.. రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మెహతాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు.