Pawan Kalyan,stay silent,Renu Desai, Allegations

రేణు ఆరోపరణలపై మౌనమే పీకే సమాధానం!

నాలుగేళ్ల క్రితమే విడిపోయిన పవన్‌, రేణు దేశాయ్‌ ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలే కొనసాగాయి. విడిపోయినా కానీ స్నేహితులమేనంటూ రేణు దేశాయ్‌ పలుమార్లు అతడి గురించి చెప్పింది. అంతే కాకుండా పవన్‌ పాత ఫోటోలని షేర్‌ చేస్తూ అతనిపై తనకున్న ఆరాధనని చాటుకుంది. అయితే రెండవ పెళ్లి నిశ్చయమైన తర్వాత రేణు స్వరం మారింది. పవన్‌పై పగ తీర్చుకునే కార్యక్రమానికి అభిమానులు చేసే కామెంట్స్‌ని అడ్డు పెట్టుకుని తెర లేపింది.

ఆమె పెళ్లి చేసుకుంటోందని తెలిసి అభినందనలు తెలిపి జెంటిల్‌మేన్‌లా పవన్‌ వ్యవహరిస్తే, తనతో విడాకులు కాకముందే మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని తండ్రి కూడా అయ్యాడని రేణు తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిని పవన్‌కి వ్యతిరేకంగా వాడుకునేందుకు వ్యతిరేక పార్టీలు, వారి పత్రికలు చాలా కృషి చేస్తున్నాయి. అయితే పవన్‌ మాత్రం ఇంతవరకు దీనిపై స్పందించలేదు.

స్పందించబోనని సన్నిహితులకి, జనసేన పార్టీలోని కీలక సభ్యులకి చెప్పాడట. తాను ఏమి మాట్లాడినా ఇప్పుడు దీనిని కొనసాగించడానికి ఆపోజిట్‌ మీడియా చాలా ట్రై చేస్తుందని, ఇలాంటి ఆరోపణలకి ఇప్పుడు సమాధానం చెప్పే కంటే సమయం చూసి మాట్లాడడం ఉత్తమమని పవన్‌ డిసైడ్‌ అయ్యాడట. కాబట్టి రేణు ఆరోపణలకి ప్రస్తుతానికి మౌనమే పవర్‌స్టార్‌ సమాధానమన్నమాట.

Tags: Pawan Kalyan,stay silent,Renu Desai, Allegations