రెడ్లకే అత్యధికం... కాంగ్రెస్ తొలి జాబితాలో కులాలు, వర్గాల వారీ కేటాయింపుల వివరాలు!

రెడ్లకే అత్యధికం… కాంగ్రెస్ తొలి జాబితాలో కులాలు, వర్గాల వారీ కేటాయింపుల వివరాలు!

  • 23 మంది రెడ్డి వర్గం నేతలకు స్థానం
  • బీసీలకు 13 స్థానాలే
  • 10 మంది మహిళలకు స్థానం

గత రాత్రి న్యూఢిల్లీలో ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాలో 65 మందికి సీట్లు దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో 23 మంది రెడ్డి వర్గానికి చెందిన నేతలు టికెట్లను దక్కించుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 39 మందికి, వెలమ వర్గానికి చెందిన ముగ్గురికి, ఓ బ్రాహ్మణ వర్గం వ్యక్తికి చోటు లభించింది. జనాభాలో సగభాగమున్న బీసీ కులాలకు 30 సీట్ల వరకూ ఇస్తామని తొలుత ప్రకటించిన కాంగ్రెస్, తొలి జాబితాలో 13 మందికి స్థానం కల్పించింది. ఈ జాబితాలో ఐదుగురు మున్నూరు కాపులు, నలుగురు గౌడ్ లు, పద్మశాలీ, యాదవ కులాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. మొత్తం జాబితాలో 10 మంది మహిళలకు స్థానం లభించింది. కాగా, ఈ జాబితాలో 32 చోట్ల గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల మార్పు కనిపించగా, మరో ఇద్దరికి స్థానాలను కాంగ్రెస్ అధిష్ఠానం మార్చింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచి, టీఆర్ఎస్ లోకి వెళ్లిన అన్ని నియోజకవర్గాల్లో ఇతరులకు టికెట్లను కేటాయించారు.