రూ.45 కోట్లు పలికిన గోల్కొండ నీలి వజ్రం

మనదేశంలోని గోల్కొండ గనుల్లో బయటపడి.. ఐరోపా రాజవంశీయుల చేతుల్లోకి వెళ్లిన అరుదైన నీలి వజ్రం ‘ఫార్నెస్‌ బ్లూ’ తాజాగా వేలంలో భారీ ధర పలికింది. 6.16 క్యారట్ల స్వచ్ఛమైన ఈ వజ్రం బేరీపండు ఆకారంలో ఉంటుంది. సోథిబే సంస్థ మంగళవారం దాన్ని వేలం వేయగా.. గుర్తుతెలియని ఔత్సాహికుడు దాదాపు రూ.45 కోట్ల భారీమొత్తానికి దక్కించుకున్నారు. ‘ఫార్నెస్‌ బ్లూ’ ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రియాల్లోని పలు రాజకుటుంబీకుల చేతులు మారింది. స్పెయిన్‌ రాజు ఫిలిప్‌-5 రెండో భార్య ఎలిసబెత్‌ ఫార్నెస్‌ పేరుమీదుగా దానికి ఆ పేరొచ్చింది. పెళ్లి కానుకగా 1715లో ఎలిజబెత్‌ ఈ వజ్రాన్ని అందుకున్నారు.