రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న ‘నన్నుదోచుకుందువటే’

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ‘నన్నుదోచుకుందువటే’
సుధీర్ బాబు సరసన నాభా నటేశ్
సెప్టెంబర్ 13వ తేదీన విడుదల
కొత్తదనం కలిగిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ సుధీర్ బాబు విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ‘నన్నుదోచుకుందువటే’ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. నాభా నటేశ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ద్వారా ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన టీజర్ మంచి మార్కులను కొట్టేసింది.

యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాను, ‘వినాయక చవితి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా సుధీర్ బాబు సొంత బ్యానర్లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హీరోగానే కాకుండా .. నిర్మాతగానూ ఆయన ఈ సినిమాతో సక్సెస్ ను అందుకుంటాడేమో చూడాలి.