రాహుల్ గాంధీ బ్రహ్మచారట...: పవన్ కల్యాణ్

రాహుల్ గాంధీ బ్రహ్మచారట…: పవన్ కల్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని వ్యక్తిగత విమర్శలకు దిగారు. రాహుల్ బ్రహ్మచారని కాంగ్రెస్ వారు అంటున్నారని గుర్తు చేసిన ఆయన, లోపల ఏం జరుగుతోందో ఎవరికి తెలుసునని ప్రశ్నించారు. తాను కూడా వ్యక్తిగత విమర్శలు చేయగలనని, వ్యక్తిగత జీవితాల ప్రభావం పరిపాలన, శాసనాల నిర్దేశంపై ఉంటుందంటే, తాను కూడా మాట్లాడతానని పవన్ వ్యాఖ్యానించారు. వాటి ప్రభావం లేనప్పుడు తన గురించి మాట్లాడటం ఎందుకని కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. కాగా, కాంగ్రెస్ నేతలు, పవన్ వైవాహిక జీవితాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించిన నేపథ్యంలో పవన్, రాహుల్ బ్రహ్మచర్యాన్ని లక్ష్యం చేసుకోవడం గమనార్హం.