రాధాకృష్ణ మాటలపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేస్తాం

విజయవాడ : ఉద్యోగస్తులను కించపరిచేలా మాట్లాడిన రాధాకృష్ణపై ఎన్నికల సంఘంతో పాటు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేస్తామనిఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ వెల్లడించారు .

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తోకపత్రిక ఆంధ్రజ్యోతి ఎమ్‌డీల మధ్య ఈ మేరకు జరిగిన సంభాషణలకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బూతు పురాణం
  • నువ్వు చెప్పినవన్నీ నిజమేనంటూ సమర్థించిన చంద్రబాబు
  • అధికారం ముఖ్యమని, అధికారం లేకపోతే ఏమీ చేయలేమంటూ వ్యాఖ్య

ఉద్యోగుస్తులను కించపరిచేలా మాట్లాడిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించడం సిగ్గు చేటని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగస్తులను కించపరిచేలా మాట్లాడిన రాధాకృష్ణపై ఎన్నికల సంఘంతో పాటు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పేరుతో ప్రభుత్వానికి తొత్తులుగా వారిపై ఎన్నికల కమిషన్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల విధుల నిర్వహణకు డ్యూటీలు వేసి వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం ఎందుకు కల్పించడంలేదో సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగులకి ఓటు హక్కు లేకుండా చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికల నిర్వహణకు వెళ్లే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకన్నతర్వాతే విధులకు హాజరు కావాలని సూచించారు.