రాజమౌళి సినిమాలో అదితీరావు!

* ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న చిత్రంలోని హీరోయిన్ల పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడంతో రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అదితీరావు హైదరి పేరు కూడా వచ్చింది. ఈ సినిమా కోసం ఆమెను నిర్మాతలు సంప్రదిస్తున్నట్టు సమాచారం.
* ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నారు. ఫిబ్రవరి నుంచి షూటింగును జరుపుకునే ఈ చిత్రాన్ని బాలకృష్ణ తన సొంత బ్యానర్ పై నిర్మించనుండడం విశేషం.
* గోపీ గణేశ్ పఠాభి దర్శకత్వంలో రూపొందిన ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని తమిళ చిత్రం ‘సతురంగ వెట్టై’ ఆధారంగా రీమేక్ చేశారు.