రవాణా శాఖ కమిషనర్‌ పై దౌర్జన్యం కేసులో కేశినేని, బోండా, బుద్ధాకు ఏపీ హైకోర్టు నోటీసులు

రవాణా శాఖ కమిషనర్‌ పై దౌర్జన్యం కేసులో కేశినేని, బోండా, బుద్ధాకు ఏపీ హైకోర్టు నోటీసులు

Share This

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం, బెదిరింపు కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో ఈ వివాదం సంచలనం అయింది. ఈ వివాదంపై మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను అప్పట్లో ఆదేశించింది. ఈ కేసు విచారణకు రాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు జారీచేసి తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది.