యంగ్ హీరో ఆంటీ తో బంధాన్ని... ఇప్పుడు పబ్లిక్ చేశారు...!

యంగ్ హీరో ఆంటీ తో బంధాన్ని… ఇప్పుడు పబ్లిక్ చేశారు…!

బాలీవుడ్ లో డేటింగ్ లు కొత్తేమి కాదు. ఒకరినొకరిని ఇష్ట పడటం చివరికి ఎంజాయ్ చేయడం తరువాత మనస్పర్థలు వచ్చాయని చెప్పడం సర్వ సాధారణం. అయితే ఈ యంగ్ హీరో ఏకంగా ఒక ఆంటీ తో డేటింగ్ చేస్తున్నాడు. అది కూడా తన కంటే వయసులో పదేళ్లు పెద్దదైన వ్యక్తితో .. చాలా కాలంగా సహజీవనంలో ఉన్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారనేది లేటెస్ట్ టాక్. అయితే ఇప్పడూ వీరు పబ్లిక్ గా తిరుగుతూ వారి బంధాన్ని బహిర్గతం చేస్తున్నారు.

ఒకప్పుడు వీళ్లిద్దరి గురించి అక్రమ సంబంధం అంటూ వార్తలు వచ్చేవి. అయితే ఆ తర్వాత వీళ్ల వ్యవహారం అంతా మారిపోయింది. ప్రత్యేకించి మలైకా ఆరోర భర్తకు విడాకులు ఇవ్వడంతో వీళ్లకు తిరుగు లేకుండా పోయింది. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తోంది ఈ జంట. మొన్నేమో విదేశీ పర్యటనకు వెళ్లారు ఎంచక్కా. మీడియా కంట అస్సలు పడకుండా ఉండటం అనే దశ దగ్గర నుంచి విదేశీ ట్రిప్ వెళ్లేంత వరకూ డేర్ చేశారు. మలైక విడాకులతో వీరి ప్రేమకు కొత్త రెక్కలు వచ్చాయి అలా.

మొన్నటి వరకూ విదేశీ పర్యటనలే.. ఇప్పుడు దేశీయంగా కూడా వీళ్ల రొమాన్స్ మొదలైంది. తమ ప్రేమ బంధంపై మరింత క్లారిటీని ఇస్తూ వీళ్లు ఇప్పుడు దేశంలోనే షికార్లు చేస్తున్నారు. మీడియాకు డేర్ గా పోజులు ఇస్తున్నారు. ఇలా ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. వచ్చే ఏప్రిల్ లో చేసుకోబోతున్నారట. ఈ విషయంపై ఇన్ డైరెక్టుగా క్లారిటీ ఇస్తున్నారు. రేపోమాపో ఈ విషయంపై వీళ్లే అధికారిక ప్రకటన చేయవచ్చు. ఇక వీళ్ల ప్రేమలో ప్రధాన విశేషం.. ఏజ్ గ్యాప్. అర్జున్ కపూర్ వయసులో సగం వయసుండే కొడుకు ఉన్నాడు మలైకా అరోరాకు. ఈ వయసులో ఈమె పెళ్లి చేసుకోవడం అది కూడా తన కన్నా చాలా చిన్నవాడితో ఈ తరహా రొమాన్స్ చేయడం మాత్రం డేరింగే!