మొదటి సినిమా సమయంలో ఏడ్చేశాను: హీరోయిన్ స్నేహ

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా స్నేహ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ నటుడు ప్రసన్నతో వివాహం తరువాత ఆమె కీలకమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా ‘వినయ విధేయ రామ’ సినిమాలో ఆమె చరణ్ కి వదిన పాత్రలో చేశారు. తాజాగా ఆమె ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.

నా అసలు పేరు సుహాసిని రాజా రామ్ నాయుడు. నేను పుట్టి పెరిగింది ముంబైలో. ఆ తరువాత కొంతకాలం దుబాయ్ లో వుండి, చెన్నైకి వచ్చాము. ఇంటర్ పూర్తయిన తరువాత నేను సినిమాల్లోకి వచ్చాను. హీరోయిన్ అయితే లైఫ్ స్టైల్ భలేగా ఉంటుందని అందరూ అనుకుంటారు. నేనూ అలాగే అనుకుని వచ్చాను కానీ మొదటి సినిమా చేస్తుండగానే ఇక్కడ నెగ్గుకు రావడం ఎంత కష్టమో తెలిసింది. దాంతో ఇక సినిమాలు చేయకూడదని అనుకున్నాను. చేయనని చెప్పేసి ఏడ్చేశాను కూడా. అమ్మానాన్నలు సపోర్ట్ గా నిలబడటంతో నెమ్మదిగా సర్దుకుపోయాను.” అని చెప్పుకొచ్చారు.
Tags: actress sneha,vinay vidheya rama,ramcharan