ముఖ్యమంత్రిగా కేసీఆర్

  • అసెంబ్లీ రద్దుతో మాజీ అయిపోయిన కేసీఆర్
  • కేర్ టేకర్ గవర్నమెంటును నడిపించాలని కోరిన గవర్నర్
  • ఇకపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించనున్న కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేయడంతో తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలంతా మాజీలయిపోయారు. కాసేపటి క్రితమే గవర్నర్ తో కేసీఆర్ సమావేశం ముగిసింది. సమావేశం సందర్భంగా అసెంబ్లీ రద్దు చేయాలని కోరడానికి గల కారణాలను గవర్నర్ కు కేసీఆర్ వివరించారు.

ఈ సందర్భంగా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని, కేర్ టేకర్ గవర్నమెంట్ ను నడిపించాలని కేసీఆర్ ను గవర్నర్ కోరారు.