వైసీపీని 25 స్థానాల్లో గెలిపిస్తే ప్రత్యేక హోదాను ఆపడం ఎవరి తరం కాదు: జగన్

మార్పు వైపు, ఆంధ్రా ప్రజల చూపు..?

Ruralmedia,editor,Shyammohan@kalingapatnam,srikakulam district,AP

పాత్రికేయులు, పరిశీలకులు ఏమంటారంటే..? 
” 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైనవి రైతు రుణమాఫీ,డ్వాక్రా రుణమాఫీ,నిరుద్యోగులకు భృతి. కానీ ఈ మూడు వాగ్దానాల్లో ఏవీ పూర్తి స్ధాయిలో నెరవేరక పోవడం వల్ల ఆయా వర్గాల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్వతిరేకత ఉంది. ఇది ఎన్నికల్లో వెల్లడవుతుంది” రాయల సీమకు చెందిన డెక్కన్‌ క్రానికల్‌ మాజీ పాత్రికేయుడు మాతో అన్నారు.
సంక్షేమం ఒక అవకాశవాదం 
” చంద్రబాబు భాషే ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడతున్నాడు. ఆంధ్రవాళ్లను హైదరాబాద్‌లో కొడుతున్నారని పవన్‌ ఒక పెద్ద అబద్ధాన్ని ఆంధ్ర ప్రజలకు చెప్పారు. హైదరాబాద్‌ దేశంలోని అన్నిరాష్ట్రాల ప్రజలను అక్కున చేర్చుకుంది. పెద్దపెద్ద కంపెనీలు, రెస్టారెంట్లు, హోటళ్లు అన్నీ ఆంధ్రా ప్రాంత వ్యాపారవేత్తలవే. ఎవరినైనా తెలంగాణ వాళ్లు కానీ వేధించిన సందర్భం ఉందా? ఎంతసేపు కేసీఆర్‌ను, జగన్‌ను తిట్టిపోసి జనాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు గుంజాలని చూస్తున్నారు. కేసీఆర్‌కు సంక్షేమం ఒక విధానం. చంద్రబాబుకు సంక్షేమం ఒక అవకాశవాద పాచిక. అందుకే ఆయనను జనం నమ్మడం లేదు. ” అని సీనియర్‌ సంపాదకుడు కట్టాశేఖర్‌ రెడ్డి విశ్లేషించారు.
రైతు సమస్యలే ఆంధ్రా తీర్పును శాసిస్తాయి? 
” ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా ఉన్నాయి. అధికారంలో ఎవరున్నప్పటికీ వారి పట్ల వ్యతిరేక భావన ఉండటం సహజం. గత ఐదేళ్లలో పార్టీలో గానీ, ప్రభుత్వ యంత్రాంగంలో గానీ విపరీతమైన అవినీతి పెరిగి పోయింది. సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అంద కుండా, అధికార పార్టీ రాజకీయ దళారుల అడ్డుకున్నారు. రైతుల రుణమాఫీ ఒక మాయ, ప్రభుత్వం మీద నమ్మకంతో రుణాలు సకాలంలో తీర్చక వడ్డీలు పెరిగి రైతులు నష్టపోయారు. వీటి ప్రభావం ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుంది..” అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా మాజీ సీనియర్‌ జర్నలిస్టు గాలి నాగరాజా అన్నారు.
వార్‌ వన్‌ సైడే… 
” భిన్నమైన రాజకీయ వాతావరణంలో ఎపీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ బహుముఖ పోటీలో ఎవరి ఓటు ఎవరు చీల్చాలనే ఎన్ని ఎత్తులు వేసినా, చైతన్యవంతమైన ఆంధ్రా ఓటర్లు చాలా స్పష్టమైన మెజారీటిని ఇవ్వబోతున్నారు. వైఎస్సార్‌సిపి కి భారీ మెజారిటీ రావడం ఖాయం. అని మా పరిశీ లనలో తేలింది.” అన్నారు, సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌ ప్రతినిధి డా.వేణుగోపాలరావు,
…………………………………………………………………………………………………………….
ఇవీ మా సర్వేలో 175 అపెంబ్లీ సీట్ల అంచనా ఫలితాలు 
వైఎస్సార్‌ సిపి – 102
తెలుగుదేశం పార్టీ -72
జనసేన – 01 , కాంగ్రెస్‌-00 , బీజేపీ-00
……………………………………………………………………………………………………………..
జిల్లాల ఫలితాలు ఇలా.. 
శ్రీకాకుళం(10) – టీడీపీ-04, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ – 06
విజయనగరం(09) -టీడీపీ-03, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 06
విశాఖపట్టణం(15) – టీడీపీ-06, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-08, జనసేన-01
ఈస్ట్‌ గోదావరి(19) – టీడీపీ-12, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 07
వెస్ట్‌ గోదావరి(15) – టీడీపీ-07, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 08
కష్ణా(16) – టీడీపీ-11, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 05
గుంటూరు(17) -టీడీపీ-10, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 07
నెల్లూరు(10) -టీడీపీ-03, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 07
ప్రకాశం(12) – టీడీపీ- 04, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 08
కర్నూలు(14) -టీడీపీ -01 , వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-13
వైఎస్సార్‌ కడప(10)-టీడీపీ -01, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-09
అనంతపురం(14) – టీడీపీ-04, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-10
చిత్తూరు(14)- టీడీపీ-06, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-08
……………………………………………………………………
లోక్‌ సభ సీట్లు… 
సమయాభావం వల్ల పాతిక లోక్‌ సభ సీట్ల విషయంలో సర్వే చేయలేక పోయాం. చిత్తూరు, నెల్లూరు, కడప, అమలాపురంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెగ్గే అవకాశం ఉంది.
…………………..
నోట్‌/ RuralMedia
ఈ అంచనాలన్నీసమగ్రమూ, సంపూర్ణం అని మేం చెప్పబోవడం లేదు. మేం స్వయంగా కలిసిన గ్రామీణులు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్ధలు ద్వారా అందిన సమాచారాన్ని విశ్లేషించి ఇచ్చిన సర్వే ఇది. అంతిమంగా ప్రజలు ఏం నిర్ణయిస్తారో అదే జరుగుతుంది. పోలింగ్‌ ముందు జరిగే ప్రలోభాలు, బ్యాంకుల్లో జమ అయ్యే పసుపుకుంకుమ,అన్నదాత సుఖీభవ డబ్బుల ప్రభావం కూడా ఈ ఫలితాల మీద ఉండే అవకాశం ఉంది.