మహాకూటమి నుంచే కొత్త ప్రధాని వస్తారు: అఖిలేశ్ యాదవ్

మహాకూటమి నుంచే కొత్త ప్రధాని వస్తారు: అఖిలేశ్ యాదవ్

Share This

అన్ని వ్యవస్థలను మోదీ నాశనం చేశారు
నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజల పొట్టకొట్టారు
ఇలాంటి వ్యక్తిని ఎవరైనా మళ్లీ కోరుకుంటారా?
దేశంలోని అన్ని వ్యవస్థలను ప్రధాని మోదీ నాశనం చేశారని… నోట్ల రద్దు, జీఎస్టీతో సగటు ప్రజల పొట్టకొట్టారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ఇలాంటి వ్యక్తి మళ్లీ ప్రధాని కావాలని ఎవరైనా కోరుకుంటారా? అని ప్రశ్నించారు. దేశానికి కొత్త ప్రధాని రావాల్సిన ఆవశ్యకత ఉందని… మహాకూటమి నుంచే కొత్త ప్రధాని వస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని మొయిన్ పురిలో ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ర్యాలీలో ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా పాల్గొన్నారు. ఎస్పీ-బీఎస్పీ కూటమికి ములాయం మద్దతిచ్చారని… ఇక కావాల్సింది ప్రజల మద్దతేనని అఖిలేశ్ అన్నారు. బీజేపీని సాగనంపేందుకే తాము కూటమిగా ఏర్పడ్డామని… మోదీని గద్దె దింపుతామని చెప్పారు.