మంగళగిరి అనరాదు మంత్రిగా మూడు పదవులు

 

  •  చంద్రబాబు, లోకేష్‌లపై లక్ష్మీ పార్వతి ఘాటు వ్యాఖ్యలు .
  • మంగళగిరి అనరాదు అయినా మంత్రి

‘లోకేష్‌ను మొన్న ఓరేయ్ మనవడా.. నువ్వు పోటీచేసే మంగళగిరి పేరు స్పష్టంగా చెప్పరా.. నా ఓటు నీకేనని చెప్పా..అయినా మందలగిరి తప్ప.. మంగళగిరి అనడమే  రాని పరిస్థితి ఉంది. వాడికి పది లక్షలు ఖర్చు పెట్టి తెలుగు మాష్టారును పెట్టి పాఠాలు నేర్పిస్తున్నారు. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున ప్రచారం చేసిన లక్ష్మీ పార్వతి.. చంద్రబాబు, లోకేష్‌లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.   వాళ్ల స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ నుంచి సర్టిఫికేట్ కొనిచ్చారట.. కానీ ఆ సర్టిపికేట్ చదవడం కూడా రాదంటూ ఎద్దేవా చేశారు ఒకటో క్లాస్ స్టాండర్డ్ లేని కొడుకును తీసుకొచ్చి మంత్రిగా మూడు పదవులు ఇచ్చి.. రేపు ముఖ్యమంత్రిని చేయాలని ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తున్నవారికి ఓటు వేయాలా’అని ప్రశ్నించారు.  హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన దొంగ  చంద్రబాబు నిప్పులు చెరిగారు లక్ష్మీ పార్వతి. ఈ ఎన్నికల్లో ఓ వైపు 40 ఏళ్ల వ్యక్తి.. మరోవైపు 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఉన్నారన్నారు. ఎవరు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. చంద్రబాబు జిత్తుల మారి నక్క.. పార్టీ, జెండా, సింబల్ ఆయనది కాదు.. దొంగిలించిందన్నారు. ఈ చిట్టెలుకను తెచ్చి సీఎంను చేయాలని ప్రయత్నం చేస్తున్నారని లోకేష్‌ను టార్గెట్ చేశారు. ఇంతకంటే సిగ్గుమాలిన రాజకీయం లేదన్నారు లక్ష్మీ పార్వతి.