భారత్‌ అభివృద్ధే లక్ష్యంగా ఎజెండా: మన్మోహన్‌

 

 

 

 

దేశ ప్రజల అభిమతం, ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించామని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్‌ అభివృద్ధే లక్ష్యంగా ఎజెండా ఉంటుందన్నారు. పదేళ్ల యూపీఏ పాలనలో దారిద్ర్య నిర్మూలనకు కృషి చేశామని, 2030 నాటికి దేశంలో పేదరికం నిర్మూలనకు కృషి చేస్తామని మన్మోహన్‌ సింగ్ స్పష్టం చేశారు.