బ్రహ్మణి వెళ్లి రాహుల్ ను కలవడం దేనికి నిదర్శనం: విజయసాయిరెడ్డి

  • పారిశ్రామికవేత్తలతో రాహుల్ సమావేశం
  • హాజరైన నారా బ్రాహ్మణి
  • రాహుల్ వి నీచపు రాజకీయాలన్న విజయసాయి

రెండు రోజుల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, హైదరాబాద్ లో పర్యటించిన వేళ, పారిశ్రామికవేత్తలతో సమావేశంకాగా, దానికి నారా చంద్రబాబు కోడలు, లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి హాజరైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శలు గుప్పించారు. “దిగ్గజ నేత డాక్టర్ వైఎస్ఆర్ కుమారుడిని తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, రాహుల్ గాంధీ కేసులను పెట్టించి గతంలో జైలుకు పంపారు. నేడు ఆయన చంద్రబాబు కుమార్తెను కలిశారు. ఇది దేనికి నిదర్శనం? రాహుల్ గాంధీ నీచ రాజకీయాలు అట్టడుగు స్థాయికి దిగజారాయి. అవునా?” అని ట్వీట్ పెట్టారు.